మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By మోహన్
Last Updated : సోమవారం, 27 మే 2019 (16:17 IST)

బైక్‌పై కూర్చుని ప్రయాణం చేసిన ఆవు..!(వీడియో)

ఆవు బైక్‌పై ఎక్కింది. ఏంటీ వింత అని ఆశ్చర్యపోతున్నారా? ఔను..నిజమేనండి. బైక్ ఎక్కిన ఆవు మాత్రం చక్కగా బుద్ధిగా కూర్చుంది. ఆవును బైక్‌పై ఎక్కించుకుని ఓ వ్యక్తి రోడ్డుపై వెళ్తుండడం చూసి ఆ దారిన పోయేవారంతా ఫోటోలు తీసుకున్నారు.
 
సాధారణంగా బైక్‌పై పెంపుడు కుక్కలను ఎక్కించుకుని ప్రయాణం చేసేవాళ్లను చూసుంటారు. ఆ కుక్కలు యజమాని బైక్‌పై ఎక్కిన తర్వాత చక్కగా బుద్ధిగా కూర్చుని, రోడ్డుపై వెళ్లేవాళ్లను పరిసరాలను చూస్తుంటాయి. 
 
ఇది మామూలుగా జరుగుతున్న విషయమే..కానీ ఓ యువకుడు తన బైక్‌పై ఆవును ఎక్కించుకుని ప్రయాణం చేయడం, అలానే ఆ ఆవు కూడా ఎలాంటి గొడవ చేయకుండా సరదాగా పెట్రోల్ ట్యాంక్‌పై కూర్చుని జర్నీని ఎంజాయ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 
 
ఈ వీడియో కాస్త వైరల్‌ అయ్యింది. గతంలో కూడా ఓ ఆవు ఇంటిపైకి ఎక్కి నానా భీభత్సం చేసిన వీడియో కూడా వైరల్‌గా మారింది. ఇంటిపైకి ఎక్కిన ఆ ఆవు ఎలా దిగాలో తెలీక పాపం అక్కడ నానా బీభత్సం చేసింది. పూల కుండీలన్నీ పగులగొట్టేసింది.