మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 27 మే 2019 (12:58 IST)

బీజేపీ కార్యకర్త హత్య... పాడె మోసిన స్మృతి ఇరానీ (Video)

కాంగ్రెస్ కంచుకోట అమెథిలో రాహుల్ గాంధీపై 55,000 ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలుపొంది స్మృతి ఇరానీ పెద్ద సంచలనమే సృష్టించారు. తాజాగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి చెందిన ఓ సాధారణ గ్రామస్థాయి కార్యకర్త చనిపోతే పాడె మోసి తన రుణం తీర్చుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ అమేథీ నియోజకవర్గంలో బరూలియా గ్రామానికి చెందిన సురేంద్ర సింగ్ బీజేపీ గ్రామస్థాయి నాయకుడు. గత ఎన్నికల్లో స్మృతి ఇరానీకి గెలుపు కోసం సురేంద్ర సింగ్ చాలా కష్టపడ్డాడు. అయితే కొందరు దుండగులు సురేంద్ర సింగ్‌ను శనివారం రాత్రి కాల్చి చంపారు. అమేథీలో రాహుల్ పైన స్మృతి ఇరానీ గెలుపొందిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
 
విషయం తెలుసుకున్న స్మృతి ఇరానీ వెంటనే బరులియా గ్రామానికి వచ్చి అతడి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మీ కుటుంబానికి అండగా ఉంటానని మాటిచ్చారు. అంతటితో ఆగకుండా సురేంద్ర సింగ్ పాడెను మోసి మానవత్వాన్ని చాటుకున్నారు.