శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 7 మే 2019 (12:03 IST)

తోక కాలిన కుక్కల్లాగా మొరగకుండా లేఖలో ఏం వుందో చదవండి.. కేవీపీ

టీడీపీ నేతలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీ మంత్రి దేవినేని ఉమతో పాటు పోలవరంపై ఓనమాలు కూడా తెలియని పండిత పుత్రులు తనను విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. వైఎస్సార్ హయంలాలో పోలవరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తీసుకురావడంతో తాను కీలకంగా పనిచేశానన్నారు. 
 
పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని కోరుకునే కోట్లాది మంది ఆంధ్రుల్లో తానూ ఒకడినని కేవీపీ అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తాను ఏపీ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాస్తే.. టీడీపీ నేతలు దిగజారుడు మాటలు మాట్లాడుతారా..? పార్టీ హైకమాండ్ ఆదేశించగానే తోక కాలిన కుక్కల్లాగా మొరగకుండా లేఖలో ఏం ఉందో చదవి స్పందించి ఉంటే బాగుండేదని కేవీపీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 
తనపై టీడీపీ నేతలు దిగజారి అసభ్య వ్యాఖ్యలు చేశారనీ, తాను వారిలా దిగజారి మాట్లాడలేనని స్పష్టం చేశారు. దేవినేని ఉమ కూడా తన లేఖలో పోలవరం ప్రాజెక్టు ఖర్చుపై వేసిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేదని కేవీపీ తెలిపారు. పోలవరం ప్రాజెక్టును ఏపీ తీసుకోవడం ద్వారా ఎంత భారం రాష్ట్రంపై పడుతుందో ఉమ చెప్పలేదన్నారు.