సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (17:59 IST)

శ్రుతిహాసన్‌ను పీవీపీ బ్లాక్ మెయిల్ చేసి.. కాల్ షీట్లు తీసుకున్నారు: నాని

సినీ లెజెండ్ కమల్ హాసన్ కుమార్తె, సినీనటి, శ్రుతిహాసన్‌పై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కామెంట్లు చేశారు. శ్రుతిహాసన్‌ను పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) బ్లాక్ మెయిల్ చేశారని నాని ఆరోపించారు. ఆమెను బ్లాక్ మెయిల్ చేసి, కాల్ షీట్లు తీసుకున్నారన్నారు. టాలీవుడ్‌లో ప్రిన్స్ మహేశ్ బాబును తప్ప అందరినీ ఇబ్బంది పెట్టారన్నారు. 
 
సినీ పరిశ్రమలో ఎందరో హీరోయిన్లను ఆయన ఏడిపించారని విమర్శించారు. మహేశ్ బాబు మాత్రమే పీవీపీ చేతికి చిక్కలేదని చెప్పారు. దర్శకులను కూడా వదలలేదని.. లీగల్ నోటీసుల పేరిట బ్లాక్ మెయిల్స్ చేసి నటీమణుల వద్ద డేట్లను తీసుకునేవారని చెప్పారు. సినీ ఇండస్ట్రీ మొత్తానికి ఇతనంటే అసహ్యం పుట్టిందని ధ్వజమెత్తారు. 
 
పీవీపీ మోసగాడని, క్రిమినల్ అంటూ కేశినేని నాని విమర్శలు గుప్పించారు. చిన్నప్పటి నుంచే ఆయన ఓ నేరగాడని దుయ్యబట్టారు. కెనరాబ్యాంకుకు రూ. 137 కోట్లు ఎగ్గొడితే మొన్ననే నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఇతను తాకట్టు పెట్టిన ఆస్తిని బ్యాంకు వాళ్లు వేళం వేస్తే, కనీసం రూ. 7 కోట్లు కూడా రాలేదని చెప్పారు. జగతి పబ్లికేషన్స్‌లో రూ. 147 కోట్ల మనీలాండరింగ్ కేసులు, హవాలా కేసులు, బొగ్గు స్కాములు ఉన్నాయని తెలిపారు.