శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (11:14 IST)

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలేదాకు ఐదేళ్ల జైలు శిక్ష.. ఎందుకని?

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని మంత్రి, నేషనలిస్ట్ పార్టీ నాయకురాలు బేగం ఖలేదా జియా ఐదేళ్ల జైలుశిక్షకు గురయ్యారు. విదేశాల నుంచి విరాళంగా జియా చారిటబుల్ ట్రస్టుకు వచ్చిన నిధులను వినియోగించుకున్నట్లు ఖలేదా జియా

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని మంత్రి, నేషనలిస్ట్ పార్టీ నాయకురాలు బేగం ఖలేదా జియా ఐదేళ్ల జైలుశిక్షకు గురయ్యారు. విదేశాల నుంచి విరాళంగా జియా చారిటబుల్ ట్రస్టుకు వచ్చిన నిధులను వినియోగించుకున్నట్లు ఖలేదా జియాపై ఆరోపణలు రుజువు కావడంతో ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రత్యేక న్యాయస్థానం తీర్పును వెలువరించింది.
 
బేగం ఖలేదా.. గతంలో రెండుసార్లు బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె చిన్నారుల చాలిటబుల్ ట్రస్ట్ కోసం వినియోగించాల్సిన ఒక కోటి 62లక్షల రూపాయలను దుర్వినియోగం చేశారు. దీంతో ప్రత్యేక న్యాయస్థానం ఆమెపై ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. ఇదే కేసులో జియా కుమారుడు తారిఖ రెహమాన్‌తో పాటు మరో నలుగురికి పది సంవత్సరాల జైలు శిక్ష ఖరారైంది.