శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2017 (13:19 IST)

స్వాతికి ఖర్మకాండలు.. సజీవదహనం చేయమంటున్న తల్లిదండ్రులు

భర్తను చంపిన స్వాతికి ఆమె తల్లిదండ్రులు ఖర్మకాండలు నిర్వహించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన తమ కూతురు బతికున్నా.. చచ్చిన శవంతో సమానమని స్వాతి తల్లిదండ్రులు పేర్కొంటూ గుండు గీయించుకున్నాడు.

భర్తను చంపిన స్వాతికి ఆమె తల్లిదండ్రులు ఖర్మకాండలు నిర్వహించారు. ఇంత దారుణానికి ఒడిగట్టిన తమ కూతురు బతికున్నా.. చచ్చిన శవంతో సమానమని స్వాతి తల్లిదండ్రులు పేర్కొంటూ గుండు గీయించుకున్నాడు. 
 
నాగర్ కర్నూల్‌కు చెందిన కాంట్రాక్టర్ సుధాకర్ రెడ్డి హత్య కేసులో ఆయన భార్య స్వాతి, ఈమె ప్రియుడు రాజేష్‌లు ప్రధాన నిందితులుగా తేలిన విషయం తెల్సిందే. దీంతో వీరిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తమ కుమార్తె స్వాతి చేసిన కిరాతక చర్యపై ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వాతితో పాటు.. ఆమె ప్రియుడు రాజేష్‌లను సజీవ దహనం చేయాలని డిమాండ్ చేశారు. 
 
ఇదే అంశంపై వారు మాట్లాడుతూ, మమ్మల్ని కాదని ప్రేమ వివాహం చేసుకున్నా కన్న మమకారాన్ని కాదనలేక ఇంట్లోకి రానిచ్చినట్టు స్వాతి తల్లి పద్మ చెప్పుకొచ్చింది. ప్రియుడితో కలిసి ఇంత దారుణానికి ఒడిగడుతుందని కలలో కూడా ఊహించలేదన్నారు. సమాజంలో మా కుటుంబాన్ని తల ఎత్తుకోకుండా చేసిన ఆమె శవంతో సమానమని, జైలు నుంచి బయటికి వచ్చినా మా ఇంటి దరిదాపులకు కూడా రానివ్వమని స్పష్టంచేశారు.
 
అలాగే, స్వాతి తండ్రి లింగా రెడ్డి మాట్లాడుతూ, అందరి తలలో నాలుకలా ఉండే మా అల్లుడు సుధాకర్‌రెడ్డిని పొట్టనపెట్టుకున్న పాపం ఉరికేపోదు. నా కన్న కూతురు ఇంత నీచానికి పాల్పడుతుందని ఏనాడూ ఊహించలేదు. మా దృష్టిలో నాకున్న ఒక్కగానొక్క కూతురు చచ్చిపోయింది.