బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr

ఎన్టీఆర్‌కు కాదు.. కేసీఆర్‌కు భారతరత్న ఇవ్వాలట...

ఆంధ్రుల ఆరాధ్య నటుడు, మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్.టి. రామారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఆ దిశగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్త

ఆంధ్రుల ఆరాధ్య నటుడు, మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్.టి. రామారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఆ దిశగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు. 
 
అయితే, ఇపుడు ఓ సరికొత్త డిమాండ్ తెరపైకి వచ్చింది. అదేంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భారతరత్న పురస్కారం ప్రదానం చేయాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ ఐకాస కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. 
 
రాష్ట్రాన్ని శాంతియుత మార్గం వైపు తీసుకెళ్తున్న కేసీఆర్‌ను ఈ నెల 25న రవీంద్రభారతిలో సత్కరించి ‘శాంతిదూత’ బిరుదు ఇవ్వనున్నట్లు ఐకాస నాయకులు తెలిపారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో మత ఘర్షణలకు తావులేకుండా శాంతియుత వాతావరణం నెలకొందని వారు పేర్కొంటున్నారు.