బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

ఆహారం మాటున ఆస్ట్రేలియాకు డ్రగ్స్ సరఫరా!

ఆహారం మాటున ఆస్ట్రేలియాకు మాదకద్రవ్యాలను సరఫరా అవుతున్నాయి. అదీకూడా కొరియర్ ద్వారా వీటి సరఫరా చేస్తున్నారు. ఆస్ట్రేలియాకు రవాణా చేస్తున్న డ్రగ్‌ (మెథాంఫెటమైన్‌)ను డీఆర్‌ఐ అధికారు‌లు పట్టుకున్నారు. 
 
డీఆర్‌ఐ అడిషనల్‌ డైరక్టర్‌ జనరల్‌ ఎంకే సింగ్ కథనం ప్రకారం.. శనివారం హైదరాబాద్‌లోని ఓ పార్సిల్‌ సెంటర్‌లో వస్తువులను తనిఖీ చేయగా.. పార్సిల్‌ డబ్బా అడుగు భాగంలో కిలో బరువు గల మెథాంఫెటమైన్‌ను నల్లకవర్‌లో చుట్టి ఉంచగా గుర్తించారు. 
 
నిందితులు తప్పుడు అడ్రస్‌లు పెట్టి వీటిని రవాణా చేస్తున్నారని తెలిపారు. నిందితులను గుర్తించలేదని, కేసు దర్యాప్తులో ఉన్నదని వివరించారు. పట్టుబడ్డ మెథాంఫెటమైన్‌ విలువ రూ.3 కోట్లు ఉంటుందని తెలిపారు.