శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (22:22 IST)

జపాన్ దేశంలో ఖరీదైన ‘ద్రాక్ష’

స్వచ్ఛమైన బంగారం పూతనుపయోగించి చేస్తోన్న  వంటలు ఇటీవలి కాలంలో ప్రసిద్ధి చెందుతోన్న విషయం తెలిసిందే. బిర్యానీ, ఐస్ క్రీం,  వడ పావ్ వంటి పలు రకాల  ఆహారపదార్ధాలు అత్యంత ఖరీదైనవిగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ కోవలోకి ‘ద్రాక్ష’ కూడా చేరింది. జపాన్ దేశంలో ఓ రకానికి చెందిన ద్రాక్ష ఒక గుత్తి ఖరీదు... భారత కరెన్సీలో రూ. 30 వేల వరకూ ఉంటోంది.
 
 
జపాన్‌లో  రూబీ రోమన్‌ ద్రాక్ష రకాన్ని పండిస్తుంటారు. ఈ ద్రాక్ష ఖరీదు గుత్తి  రూ. 30-రూ. 35 వేల వరకు ఉంటోంది. ఇక... ఖరీదుకు తగ్గట్టే ఈ ద్రాక్ష మాములు ద్రాక్ష కంటే నాలుగు రేట్లు పెద్దదిగా ఉంటుండడంతో దీనిని ప్రత్యేకంగా పరిగణిస్తారు. అంతేకాదు... ఈ ద్రాక్ష రంగు, రుచి కూడా వివిభిన్నంగా ఉంటాయి. ఇక రూబీ  రోమన్ ద్రాక్ష చాలా అరుదుగా దొరకడం వల్ల కూడా దీనికి అంత డిమాండ్‌ ఏర్పడిందని చెబుతుంటారు. 

ద్రాక్షగుత్తిలో ఒక్కో పండు కనీసం 20 గ్రాముల బరువు, 30 మి.మీ. పరిమాణం ఉంటుంది. ఇక... నిరుడు ఓ గుత్తిని అమ్మితే రూ. 8.8 లక్షల వరకు( 12వేల డాలర్లు) పలికడం విశేషం.  తాజాగా ఇప్పుడు కూడా ఈ ద్రాక్ష అధిక ధరకు అమ్ముడై తనదైన ఒరవడిని కొనసాగిస్తోంది. జపాన్‌లో మాత్రమే పండే రూబీ రోమన్‌ రకం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రాక్షగా ప్రత్యేకత చాటుకుంటోంది. ఈ ద్రాక్షను అత్యంత విలాసవంతమైనదిగా,  ఖరీదైనదిగా చెబుతుంటారు.