నేటి నుంచి టోక్యోలో పారా ఒలింపిక్స్ పోటీలు
జపాన్ రాజధాని టోక్యో వేదికగా పారా ఒలింపిక్స్ పోటీలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. వచ్చేనెల ఐదో తేదీతో ముగుస్తాయి. ఈ టోక్యో పారా ఒలింపిక్స్ క్రీడల్లో మొత్తం 163 దేశాల నుంచి 4500 మంది పారా అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఇందుకోసం జపాన్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 22 క్రీడాంశాల్లో 540 పతక ఈవెంట్లు జరగబోతున్నాయి.
ఇక భారత్ నుంచి 54 మంది పారా అథ్లెట్లు టోక్యో పారా ఒలింపిక్స్‌లో పాల్గొంటున్నారు. టోక్యో ఒలింపిక్స్‌తో భారత్ మెరుగైన ఫలితాలు సాధించింది. మొత్తం 7 పతకాలు సాధించి భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించే సత్తా ఉందని నిరూపించింది.
ఇటీవలే జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో కూడా ఈ క్రీడలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించారు.