శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 23 ఆగస్టు 2019 (13:25 IST)

బ్లాక్‌లిస్టులో పాకిస్థాన్... గాడిదలు విక్రయించి నిధుల సేకరణలో ఇమ్రాన్

పాకిస్థాన్‌కు మరోమారు గట్టి ఎదురుదెబ్బతగిలింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమేకాకుండా, ఆ ఉగ్ర సంస్థలకు భారీగా నిధులు సమకూర్చుతోందన్న ఆరోపణలు లేకపోలేదు. దీంతో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్.ఏ.టి.ఎఫ్) కొరఢా ఝుళిపించింది. ఈ ఉగ్ర సంస్థలకు నిధుల సరఫరాను నివారించడంలో విఫలమైనందున పాకిస్థాన్‌ను ఎఫ్.ఏ.టి.ఎఫ్ బ్లాక్‌లిస్టులో పెట్టింది. 
 
శుక్రవారం ఆస్ట్రేలియాలోని కాన్‌బెర్రాలో సమావేశమైన కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద సంస్థలపై చర్యలకు 11 అంశాలను పాక్‌కు వివరించామని, వాటిలో ఏ ఒక్కటీ ఇమ్రాన్‌ ప్రభుత్వం పాటించలేదని సంస్థ పేర్కొంది. 26/11 ముంబై పేలుళ్ల నిందితుడు హఫీజ్ సయీద్ సహా పలు పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలకు పాకిస్థాన్ కొమ్ముకాస్తోందంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
 
గతంలో గ్రే లిస్టులో ఉన్న పాకిస్థాన్‌ తాజాగా బ్లాక్‌లిస్ట్‌లోకి చేరడంతో అంతర్జాతీయ పరంగా ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనుంది. కాగా ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వానికి ఆర్థిక సహాయం చేయడానికి ఇప్పటికే అనేక అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో నిధులు సమకూర్చుకునేందుకు అనేక దారులను అన్వేషిస్తున్న ఇమ్రాన్‌.. గత్యంతరం లేక ప్రభుత్వ ఆస్తులను సైతం అమ్మకానికి పెడుతున్నారు. గతంలో జులాయిగా తిరిగే గాడిదలను కూడా చైనాకు విక్రయించిన విషయం తెల్సిందే.