ప్రపంచంలోనే అతిపిన్న ప్రధానిగా రికార్డు
ఫిన్లాండ్ కొత్త ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న సన్నా మారిన్ ప్రపంచంలోనే యంగ్ ప్రైమ్‌మినిస్టర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు ఉన్న ప్రధాని అంట్టీ రిన్నే రాజీనామా చేయడంతో సోషల్ డెమోక్రట్స్ 34 ఏళ్ల మారిన్‌ను ప్రధానిగా ఎన్నుకున్న విషయం తెల్సిందే.
దీంతో ఇప్పటి వరకు యంగ్ ప్రైమ్‌మినిస్టర్‌గా ఉన్న ఉక్రెయిన్ ప్రధాని ఒలెక్సీ హొంచారుక్ రికార్డును ఆమె తిరగరాశారు. ఫిన్లాండ్ చరిత్రలో ఇంత చిన్న వయసులో ప్రధాని అయింది కూడా ఆమెనే కావడం గమనార్హం.
గతంలో ఆమె రవాణా శాఖామంత్రిగా పని చేశారు. 'ప్రజల్లో నమ్మకం తీసుకురావాలి. నా జెండర్, ఏజ్ గురించి ఎప్పుడూ ఆలోచించను' అని మారిన్ చెప్పుకొచ్చారు.