సంబంధిత వార్తలు
- 'మేఘా' ఇంట్లో రూ.78 కోట్ల నగదు… 33 కిలోల బంగారం స్వాధీనం
- తెలంగాణాలో రాష్ట్రపతి పాలనకు రంగం సిద్ధం..?
- కేసీఆర్ సర్కారుకు మొట్టికాయలు ... భవనాలు ఎందుకు కూల్చివేస్తున్నారు?
- భవిష్యత్తుపై ఆందోళనే తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మహత్యలకు కారణమా?
- ఆర్టీసీ సమ్మె: కండక్టర్ ఆత్మహత్య వార్త చూసి గుండెపోటుతో డ్రైవర్ తల్లి హఠాన్మరణం
తెలంగాణ ఆర్టీసి సమ్మె ఎఫెక్ట్: ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆత్మహత్యల పరంపర సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్ తమిళిసైకి ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. తెలంగాణలో పరిస్థితి గురించి ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీతో సమావేశమై వివరించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. తెలంగాణలో తలెత్తిన పరిస్థితులకు సంబంధించి గవర్నర్ కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
మొత్తమ్మీద టీఎస్ ఆర్టీసి దెబ్బతో కేసీఆర్ సర్కారుకి షాక్ తప్పేట్లు లేదు. ఉద్యోగులకు- ప్రభుత్వానికి మధ్య రాజీ కుదరకపోవడంతో ఆర్టీసి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. దీనితో కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
