సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: సోమవారం, 14 అక్టోబరు 2019 (19:41 IST)

ఆర్టీసీ సమ్మె: కండక్టర్ ఆత్మహత్య వార్త చూసి గుండెపోటుతో డ్రైవర్ తల్లి హఠాన్మరణం

ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం అనంతారం గ్రామానికి చెందిన 70 ఏళ్ల శ్రీమతి దామెర్ల అగ్నేశ్ ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల ప్రభుత్వ నిర్బంధాన్ని, కార్మికుల ఆత్మహత్యలకు సంబంధించి వార్తలను టీవీలో చూసి చలించిపోయి, ఈ రోజు ఉదయం గం" 10-00 లకు టీవీ చూస్తూనే ప్రాణాలు విడిచారు.
 
తన ఇద్దరు కుమారులలో ఒకరు దామర్ల వీరభద్రం మధిర డిపోలో డ్రైవర్ కాగా, మరో కుమారుడు దామర్ల రాఘవులు ఖమ్మం డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.
 గత పది రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె రాష్ట్ర ప్రభుత్వ నిర్బంధం, కార్మికులు చేస్తున్న ఆత్మహత్యలతో చలించిపోయారు.
 
తన ఇద్దరు కుమారులుకు ధైర్యం చెప్పి, ఎటువంటి అఘాయిత్యాలకు చర్యలకు పాల్పడవద్దని చెప్పిన శ్రీమతి అగ్నేశ్, హైదరాబాదులో ఆత్మహత్య చేసుకున్న కండక్టర్ సురేందర్ గౌడ్ మరణ వార్తను టీవీలో చూసి టీవీ ముందే కుప్పకూలిపోయారు.