శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 13 అక్టోబరు 2019 (11:04 IST)

ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది.. కానీ ఒక బిడ్డ మాత్రం?

ఒకే కాన్పులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది.. కానీ ఒక బిడ్డ మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రాజస్థాన్‌లోని జైపూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జైపూరుకు చెందిన రుషానాకు ఆదివారం ఉదయం పురిటి నొప్పులు ఏర్పడ్డాయి. ఆపై ఆమెను కుటుంబీకులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు ఐదుగురు శిశువులు జన్మించారు. 
 
అయితే ఐదు శిశువుల్లో ఒక శిశువు మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ఆ శిశువులు నెలలు నిండకుండానే పుట్టడంతో.. తగినంత బరువు లేకపోవడంతో ఐదుగురిలో ఒక శిశువు మాత్రం ప్రాణాలు కోల్పోయింది. మిగిలిన నలుగురు శిశువులకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.