గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By mohan
Last Modified: గురువారం, 4 అక్టోబరు 2018 (14:30 IST)

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? తెచ్చేవారు తింటున్నారేమో చూడండి..

కస్టమర్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వాటిని డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్ అందులోని పదార్థాలను తింటూ ఇంటిలో అమర్చిన నిఘా కెమెరాలకు చిక్కాడు.

కస్టమర్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వాటిని డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్ అందులోని పదార్థాలను తింటూ ఇంటిలో అమర్చిన నిఘా కెమెరాలకు చిక్కాడు. ఆస్ట్రేలియా రాజధాని మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆన్‌లైన్ ద్వారా ఉబెర్ ఈట్స్‌లో ఆర్డర్ చేసిన కస్టమర్‌కి ఉబెర్ ఈట్స్ డ్రైవర్ చేసిన పని ఆశ్చర్యానికి గురిచేసింది. 
 
ఫుడ్ డెలివరీ చేసేందుకు ఇంటి ముందు నిల్చుని అతడు అందులో చిప్స్‌ను తీసుకుని తింటూ సీసీటీవీలో రికార్డ్ అయ్యాడు. ఈ సంఘటన మూలంగా ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసేందుకు కస్టమర్‌లు కొంత ఆలోచిస్తున్నారు. అయితే ఆ సంస్థకు చెందిన ఒక వ్యక్తి మాత్రం తాము ఆహార భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తామని, అలాగే రెస్టారెంట్‌ల నుండి నాణ్యమైన ఆహారపదార్థాలు అందించడానికి ఎప్పుడూ కృషి చేస్తామని, ఇలాంటి ఘటన మళ్లీ జరగకుండా జాగ్రత్త పడతామని చెప్పాడు. 
 
ఇదిలా ఉంటే భారతదేశంలో కూడా ఇలాగే అనేక సంస్థలు ఆన్‌లైన్ ద్వారా ఫుడ్ సప్లై చేస్తున్నాయి. అయితే నాణ్యత విషయానికొస్తే, సరైన ప్రమాణాలను పాటించడంలేదని వినియోగదారులు వాపోతున్నారు.