ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 10 ఏప్రియల్ 2017 (16:15 IST)

భారత రిటైర్డ్ నేవీ అధికారికి పాకిస్థాన్ ఉరిశిక్ష.. ఎందుకో తెలుసా?

భారత మాజీ నేవీ అధికారికి పాకిస్థాన్ ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేయనుంది. కుల్భూషణ్ యాదవ్ అనే రిటైర్డ్ నేవీ అధికారిపై పాక్ ప్రభుత్వం గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలపై కేసు నమోదు చేసింది. గతేడాది ఆయన ఇరాన్

భారత మాజీ నేవీ అధికారికి పాకిస్థాన్ ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేయనుంది. కుల్భూషణ్ యాదవ్ అనే రిటైర్డ్ నేవీ అధికారిపై పాక్ ప్రభుత్వం గూఢచర్యం చేస్తున్నాడన్న ఆరోపణలపై కేసు నమోదు చేసింది. గతేడాది ఆయన ఇరాన్ మీదుగా బలూచిస్తాన్ వెళ్లినప్పుడు అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఆ తర్వాత కుల్భూషణ్‌ విడుదల కోసం భారత్ ఎన్నో రకాలుగా ప్రయత్నించింది. అయినప్పటికీ పాకిస్థాన్ అతన్ని అప్పగించలేదు. కుల్బూషణ్ పాకిస్థాన్ తీవ్రవాద కార్యకలపాలు కొనసాగిస్తున్నాడంటూ ఆ దేశ విదేశీ వ్యవహార సలహాదారు సర్తాజ్ అజీజ్ కూడా ఆరోపించారు. 
 
అలాగే, బలూచిస్తాన్‌లో హింసను ప్రేరేపించేలా భారత్ ప్రొత్సహిస్తోందని యాదవ్ చెప్పినట్లు గతేడాది మార్చిలో పాకిస్థాన్ ఆరోపించగా, కేంద్రం కొట్టిపారేసింది. ఈ నేపథ్యంలో కుల్భూషణ్‌కు గూఢచర్య కేసులో ఉరితీయనుంది.