శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (13:44 IST)

వధువు అక్రమ సంబంధం.. వీడియోలో చూపిన వరుడు (Video)

తనకు కాబోయే భార్య (వధువు) గతంలో తనతో పాటు పలువురితో కొనసాగించిన వివాహేతర సంబంధాన్ని వరుడు వీడియో వేసిమరీ చూపించాడు. ఈ వీడియో చూసిన వధువు అవమానభారంతో కల్యాణమండపం నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియోను చూసిన వ

తనకు కాబోయే భార్య (వధువు) గతంలో తనతో పాటు పలువురితో కొనసాగించిన వివాహేతర సంబంధాన్ని వరుడు వీడియో వేసిమరీ చూపించాడు. ఈ వీడియో చూసిన వధువు అవమానభారంతో కల్యాణమండపం నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియోను చూసిన వరుడు, వధువు కుటుంబాల సభ్యులు కూడా నిశ్చేష్టులైపోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
సింగపూర్‌కు చెందిన ఓ యువకుడుకి ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. దీంతో ఇరు కుటుంబాల బంధు మిత్రులు, వధూవరుల స్నేహితులు పెళ్లి వేడుక కోసం సిద్ధమయ్యారు. ఇంతలో వరుడు ఓ వీడియోను చూపుతానని చెబుతూ స్క్రీన్‌పై తాను ముందే సమీకరించి పెట్టుకున్న వీడియోను ప్లే చేశాడు. 
 
తొలుత వధూవరులు గతంలో కలిసి తిరిగిన దృశ్యాలతో ప్రారంభమైన వీడియో, ఆ తర్వాత మరో వ్యక్తితో కలసి హోటల్ రూమ్‌లోకి వెళ్లడం, ఆపై అతనితో అక్రమ సంబంధాన్ని కొనసాగించే దృశ్యాలు కనిపించాయి. దీంతో ఆ యువతి అక్రమ సంబంధం బట్టబయలైంది. 
 
ఈ వీడియోను చూసినవారంతా నిశ్చేష్టులైపోయారు. వధువు కూడా అవమానంతో వెడ్డింగ్ హాల్ నుంచి వెళ్లిపోయింది. ఓ అమ్మాయి బండారాన్ని నలుగురి ముందూ బట్ట బయలు చేసి, జీవితాంతం గుర్తుండిపోయేలా పాఠం చెప్పాడు.  ఆ వీడియోలోని కొన్ని దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని మీరూ చూడొచ్చు.