ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , బుధవారం, 12 ఏప్రియల్ 2017 (05:09 IST)

మండిపడ్డ ఇవాంకా... రెచ్చిపోయిన ట్రంప్... ధ్వంసమైన స్థావరం!

భారత యుద్ధం ద్రౌపది వల్ల కుంతి వల్లా జరిగిందని పండితులు చెబుతుంటారు కదా. వార్ రూమ్‌లో తీసుకోవలసిన నిర్ణయాలు అంతఃపుర స్థాయిలో కూడా తీసుకున్న ఘటనలను చరిత్ర నమోదు చేసింది. ఆధునిక కాలంలో కూడా ఇలాంటి ఘటనలు

భారత యుద్ధం ద్రౌపది వల్ల కుంతి వల్లా జరిగిందని పండితులు చెబుతుంటారు కదా. వార్ రూమ్‌లో తీసుకోవలసిన నిర్ణయాలు అంతఃపుర స్థాయిలో కూడా తీసుకున్న ఘటనలను చరిత్ర నమోదు చేసింది. ఆధునిక కాలంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా నిరూపించింది. 
 
సిరియా వైమానిక స్థావరంపై దాడి చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయం తీసుకోవడానికి ఆయన కుమార్తె ఇవాంకా వేదన కూడా కారణమని తెలిసింది.  ట్రంప్‌ కుమారుడు ఎరిక్‌ ఈ విషయాన్ని తెలుపుతూ, సిరియా గ్యాస్‌ దాడిలో గాయపడిన చిన్నారులపై మందును స్ప్రే చేస్తున్న చిత్రాలను చూసి తన తండ్రి ట్రంప్ చలించిపోయారని చెప్పారు. 
 
మరోవైపున గ్యాస్‌ దాడితో తన గుండె పగిలిపోయిందని ఇవాంకా చెప్పినట్లు ‘టెలిగ్రాఫ్‌ పత్రిక’ పేర్కొంది. దాడి భయకరంగా ఉందని, తన తండ్రి సకాలంలో చర్య తీసుకుంటాడని ఆమె చెప్పింది. చెప్పినట్లే ఆ వెనువెంటనే ట్రంప్ ఆదేశాలతో అమెరికా యుద్ధ నౌక సిరియా వైమానిక స్థావరంపై దాడి చేసి ధ్వంసం చేయడం తెలిసిందే.