శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 27 డిశెంబరు 2017 (10:57 IST)

పాకిస్థాన్ మీడియా ఓవరాక్షన్.. జాదవ్ తల్లిని అలా సంబోధించింది..

భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ తల్లిపై పాకిస్థాన్ మీడియా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓవరాక్షన్ చేసింది. జాదవ్ తల్లిపై పాకిస్థాన్ మీడియా నోరు పారేసుకుంది. ఆమెను హంతకుడి తల్లి అంటూ సంబోధించి తన వక్

భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ తల్లిపై పాకిస్థాన్ మీడియా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓవరాక్షన్ చేసింది. జాదవ్ తల్లిపై పాకిస్థాన్ మీడియా నోరు పారేసుకుంది. ఆమెను హంతకుడి తల్లి అంటూ సంబోధించి తన వక్రబుద్ధిని చాటుకుంది. ఇస్లామాబాద్‌లోని విదేశాంగ శాఖ కార్యాలయం బయట.. కుల్‌భూషణ్ తల్లి, భార్యను కారులో కూర్చెబెట్టిన సమయంలో పాక్ జర్నలిస్టులు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. ఇక పాకిస్థాన్ మీడియాపై భారత్ మండిపడుతోంది. 
 
భారత నేవీ మాజీ అధికారి అయిన కుల్‌భూషణ్ జాదవ్‌ను గూఢచర్య ఆరోపణలపై పాక్ అదుపులోకి తీసుకుంది. ఏప్రిల్‌లో మరణశిక్ష విధించింది. అయితే ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో పాక్ వెనక్కి తగ్గింది. భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో అతడి ఉరిపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో జాదవ్‌ హంతకుడు ఎలా అవుతాడని సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 
 
పాకిస్థాన్ మీడియా ఓవరాక్షన్ చేస్తుందని వారు మండిపడుతున్నారు. జాదవ్‌ను కలిసేందుకు తల్లి అవంతి జాదవ్, భార్య చేతన్‌కుల్ జాదవ్‌లకు అనుమతి ఇచ్చిన పాక్ అక్కడ కూడా ఆంక్షలు విధించింది. కుమారుడిని నేరుగా కలవకుండా గాజు తెర అడ్డంగా పెట్టింది. ఈ చర్యలపై కూడా నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా పాకిస్థాన్‌ను ఎండగుడుతున్నారు.