బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 మే 2020 (10:08 IST)

చైనాలో 5జీ సేవలు ప్రారంభం.. అది ఎక్కడో తెలుసా?

కరోనా భయంతో ప్రపంచ దేశాలు వణికిపోతుంటే.. చైనా మాత్రం తన పని తాను చేసుకుపోతుంది. కరోనాకు పుట్టినిల్లు అయిన చైనా ప్రస్తుతం కోవిడ్ -19ను పట్టించుకోకుండా 5జీ సేవలను ప్రారభించింది. ప్రపంచం మొత్తానికి కరోనా వైరస్ ని అంటించి ఆయా దేశాలు ఇబ్బంది పడుతుంటే చైనా మాత్రం టెక్నాలజీలో మాత్రం దూసుకెళుతోంది. 
 
చైనాలో 5జీ సేవలు మొదలయ్యాయి. అయితే ఈ సేవలు కేవలం ఎవరెస్ట్ శిఖరం ప్రాంతంలో మాత్రమే. చైనా దేశం వైపు నుంచి ఎవరైతే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే పర్వతారోహకులకు ఈ సేవలను అందుబాటులోకి తీసుకవచ్చింది. ఈ సందర్భంగా చైనా దేశపు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన " చైనా మొబైల్ " కంపెనీ నిర్మించిన బేస్ స్టేషన్ తన కార్యకలాపాలను మొదలు పెట్టిందని చైనా మీడియా తెలిపింది. 
 
ఎవరెస్ట్ పర్వతం శిఖరంపై పూర్తి స్థాయిలో ఐదు సేవలను అందించుటకు 5,300 మీటర్లు, 5800 మీటర్ల ఎత్తున బేస్ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేశారని చైనా అధికార వార్తాపత్రిక 'జిన్హువా' ఈ విషయాన్ని తెలిపింది. ఇక ఎత్తైన ప్రదేశంలో 5జీ స్టేషన్లను నిర్మించేందుకు ఏకంగా 14.2 లక్షల డాలర్లు ఖర్చు అయినట్లు చైనా మీడియా పేర్కొంది.