శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 జులై 2021 (15:18 IST)

ఢాకాలోని పుడ్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం... 52 మంది సజీవి దహనం

బంగ్లాదేశ్ రాజాధాని ఢాకా శివారు ప్రాంతంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 52 మంది సజీవదహనమయ్యారు. ఢాకా శివారు ప్రాంతంలోని హషీమ్ ఫుడ్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. 
 
రూప్ గంజ్ ప్రాంతంలోని ఆరు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది పెద్దసంఖ్యలో అందులో చిక్కుకుపోయారు. ఇప్పటివరకు 52 మృతదేహాలను వెలికితీశారు. 
 
ఈ ఘటన జరిగిన సమయంలో చాలామంది కార్మికులు భవనం పై అంతస్తుల నుంచి కిందికి దూకి గాయాలపాలయ్యారు. 30 మంది క్షతగాత్రులను అధికారులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.