Daily Horoscope
✕

యూఏఈకి భారీస్థాయిలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలు

Written By ఎం
Updated: ఆదివారం, 19 ఏప్రియల్ 2020 (23:00 IST)
కరోనా విపత్తును సర్వశక్తులు ఒడ్డి ఎదుర్కొంటున్న భారత్, అదే సమయంలో ఇతర దేశాలకు సాయం చేయాలన్న మానవతా దృక్పథాన్ని మరవడంలేదు.

తాజాగా భారీస్థాయిలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను యూఏఈకి పంపించింది. సాధారణంగా మలేరియా చికిత్సలో వినియోగించే క్లోరోక్విన్ మాత్రలు కరోనా చికిత్సలో అమోఘంగా పనిచేస్తున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పడంతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి భారత్ పై పడింది.

ఈ క్లోరోక్విన్ వాడకంలోనూ, నిల్వల పరంగానూ భారత్ అగ్రగామిగా ఉండడమే అందుకు కారణం. అయితే భారత్ ఈ మాత్రల ఎగుమతులపై ఉన్న ఆంక్షలను సడలించి ఉదారంగా అనేక దేశాలకు పంపిస్తోంది.

ఇప్పటికే అమెరికా, మారిషస్, సీషెల్స్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలకు క్వోరోక్విన్ మాత్రల ఎగుమతి జరిగింది. తాజాగా యూఏఈకి 5.5 మిలియన్ల మాత్రలను రవాణా చేస్తోంది. ఈ మేరకు ప్రత్యేక విమానం యూఏఈకి బయల్దేరినట్టు భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది.

అన్నీ చూడండి

Soori 7: సూరి ఏడవ కథానాయకుడిగా సూరి 7 చెన్నైలో ఘనంగా ప్రారంభమైంది

Naga Chaitanya :మైథికల్ థ్రిల్లర్ నాగ చైతన్య వృషకర్మ సరికొత్త అడ్వెంచర్ పోస్టర్

Anupama: నా పెళ్లి గురించి ఇంట్లో ఒత్తిడి లేదు. ఇష్టమైనప్పుడు పెళ్లి చేసుకోమనే అన్నారు : అనుపమ పరమేశ్వరన్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ హీరోగా అనిల్ సుంకర చిత్రం ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్

Teja Sajja: గరివిడి లక్ష్మి మ్యూజికల్ కాన్సర్ట్ తో గౌరవం తీసుకొచ్చే సినిమా : తేజ సజ్జా

తర్వాతి కథనం
Show comments