శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 జనవరి 2020 (20:11 IST)

ఆ సమయంలో నర్సులు అప్సరసల్లా కనిపించారు: ఇమ్రాన్ ఖాన్

పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ నోరు జారడటం కొత్తేమీ కాదు. భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆ తర్వాత వెనక్కి తగ్గడం ఆయనకి కొత్తేమీ కాదు. తాజాగా ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. నెటిజన్లకు దొరికిపోయారు. ఇక నెటిజన్లు మాత్రం ఇమ్రాన్ ఖాన్‌పై ట్రోలింగ్ మొదలు పెట్టారు. 
 
వివరాల్లోకి వెళితే.. కరాచీలోని ఓ ఆసుపత్రిలో ప్రసంగించిన ఇమ్రాన్.. తాను ఒకప్పుడు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న సందర్భం గురించి ప్రస్తావించారు.
 
2013 ఎన్నికల ప్రచారంలో తాను వేదికపై పడిపోయిన సందర్భం అది అంటూ మొదలెట్టారు. ఆ తర్వాత తాను షౌకత్ ఖానుమ్ ఆసుపత్రిలో అడుగుపెట్టినప్పుడు, గాయాల కారణంగా తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్నానని చెప్పారు. 
 
కానీ డాక్టర్ అసిమ్ తనకు ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఆ నొప్పులన్నీ మాయమైపోయాయని తెలిపారు. ఆ సమయంలో నర్సులు అప్సరసల్లా కనిపించారంటూ ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైనాయి. తరువాత ఆసుపత్రి ఆవరణలోనే ఓ టీవీ ఇంటర్వ్యూ ఇచ్చానని చెప్పారు. 
 
ఇంకేముంది.. ప్రస్తుతం నెట్టింట నర్సులపై ఇమ్రాన్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఒకటి సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక నెటిజన్లు ఇమ్రాన్‌ను ఓ రేంజ్‌లో ఆటాడుకుంటున్నారు.