శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 డిశెంబరు 2019 (09:05 IST)

భారత్ పౌరసత్వ సవరణ బిల్లును అడ్డుకోండి : ఇమ్రాన్ పిలుపు

భారత అంతర్గత వ్యవహారాల్లో పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మరోమారు జోక్యం చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ బిల్లును అడ్డుకోవాలంటూ ఆయన ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. పైగా, ఈ బిల్లుపై ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అదేసమయంలో మోడీపై ఆయన తీవ్ర ఆరోపణలు కూడా చేశారు. 
 
ప్రధాని మోడీ ఓ పద్ధతి ప్రకారం హిందూ ఆధిపత్య ఎజెండాను అమలు చేస్తున్నారంటూ ట్వీట్ చేశారు .అలాగే, అణుయుద్ధ బెదిరింపుల వల్ల పెద్ద ఎత్తున రక్తపాతం జరుగుతుందని, ఊహించనన్ని దుష్పరిణామాలు జరిగే అవకాశం ఉందన్నారు. పరిస్థితి చేయి దాటకముందే ప్రపంచం అడ్డుకోవాలని సూచించారు. 
 
కాగా, ఇమ్రాన్ వ్యాఖ్యలకు భారత్ అంతే ఘటుగా సమాధానం ఇచ్చింది. తమ అంతర్గత విషయంలో తలదూర్చడం మానుకోవాలని హితవు పలికింది. తొలుత పాకిస్థాన్‌లోని మైనారిటీల సంగతి చూడాలని విదేశీ వ్యవహారాల ప్రతినిధి రవీశ్‌కుమార్‌ కౌంటరిచ్చారు. ఇల్లు చక్కదిద్దుకుని వీధిలోకి రావాలంటూ సూటిగా చెప్పారు. మరోవైపు, పాకిస్థాన్‌లోని మైనారిటీ హిందువులపై దాడులు జరుగుతున్న విషయం తెల్సిందే.