సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 11 డిశెంబరు 2019 (15:12 IST)

రూ.12 వేలకే అమెజాన్ స్మార్ట్ టీవీలు.. 20 నుంచి బుకింగ్స్

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తమ వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది. 32 అంగుళాల స్మార్ట్ టీవీని కేవలం 12 వేల రూపాయలకే విక్రయించనున్నట్టు ప్రకటించింది. ఈ సేల్స్ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. 
 
ప్రస్తుతం అమెజాన్ సంస్థ టీవీల తయారీదారు ఒనిడాతో కలిసి నూతనంగా ఒనిడా ఫైర్ టీవీ ఎడిషన్ పేరిట కొత్త స్మార్ట్‌టీవీలను భారత్‌లో విడుదల చేసిన విషయం తెల్సిందే. ఇందులో 32, 43 ఇంచుల డిస్‌ప్లే సైజులు ఉన్నాయి. 
 
కాగా ఇవి అమెజాన్ ఫైర్ టీవీ సాఫ్ట్‌వేర్ ఆధారంగా పనిచేస్తాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే.. ఫైర్ టీవీ స్టిక్‌లో ఉండే సాఫ్ట్‌వేర్ ఈ టీవీల్లో ఇన్‌బిల్ట్‌గా ఉంటుంది. ఇక 32 ఇంచ్ టీవీ హెచ్‌డీ రిజల్యూషన్‌ను అందిస్తే, 43 ఇంచ్ టీవీ ఫుల్ హెచ్‌డీ రిజల్యూషన్‌ను ఇస్తుంది. 
 
ఈ క్రమంలో ఈ టీవీల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్, యూట్యూబ్ తదితర స్ట్రీమింగ్ యాప్స్‌ను ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు. కాగా 32 ఇంచుల టీవీ ధర రూ.12,999 ఉండగా, 43 ఇంచుల టీవీ ధర రూ.21,999గా ఉంది. వీటిని డిసెంబర్ 20 నుంచి అమెజాన్‌లో విక్రయించనున్నారు.