శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2019 (12:17 IST)

డెలివరీ బాయ్‌కి ఫ్రీ ఫుడ్ పెట్టిన మహిళ.. వీడియో వైరల్

అమేజాన్ సంస్థ డెలివరీ బాయ్‌ ఓ ఇంటికి ఐటమ్ డెలివరీ చేసేందుకు వెళ్లాడు. అక్కడ వాటర్ బాటిల్స్, కూల్‌డ్రింక్స్, స్నాక్స్ కుకీస్, క్రేకర్స్ ప్యాకెట్లు ఉండటం చూశాడు. అవి డెలివరీ బాయ్స్ కోసం ఫ్రీగా ఉంచినవని తెలియడంతో తెగ ఆనందపడిపోయాడు. 
 
ఇంకా ఆ ఇంటి యజమానికి థ్యాక్స్ చెప్తూ.. డ్యాన్స్ చేస్తూ, తనకు కావాల్సినవి తీసుకొని పండగ చేసుకున్నాడు. అమెరికా... విల్మింగ్టన్‌లోని డెలావేర్‌లో ఓ ఇంటి ముందు ఇలా ఉచితంగా ఫుడ్ పెట్టిన మహిళ ఆ ఇంటి ఓనర్. 
 
ఆమె చేసిన మంచి పనిని ఇప్పుడు అంతా మెచ్చుకుంటున్నారు. యాహూ లైఫ్ స్టైల్‌ ఫేస్ బుక్ పేజీలో పెట్టిన ఆ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ట్విట్టర్‌లో కూడా దుమ్మురేపుతోంది.


https://www.facebook.com/fox5atlanta/videos/524289524824315/