సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 నవంబరు 2019 (12:03 IST)

డ్రైవింగ్‌ చేసేటప్పుడు బిగుతైన జీన్స్ ధరిస్తున్నారా?

జీన్స్ ధరిస్తున్నారా? బిగుతుగా ధరించే దుస్తులతో ఇబ్బందులు తప్పవని పలు పరిశోధనలు ఇప్పటికే తేల్చిన తరుణంలో... జీన్స్ ద్వారా ఓ మరణం సంభవించింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. టైట్ జీన్స్ వేసుకున్న ఓ వ్యక్తి దాదాపు 8 గంటల పాటు ఏకధాటిగా కారు డ్రైవింగ్ చేశాడు. దాంతో పల్స్ రేట్ పడిపోయి గుండెపోటుకు గురయ్యాడు. 
 
వివరాల్లోకి వెళితే.. పీతమ్‌పురాకు చెందిన సౌరభ్ శర్మ (30) టైట్ జీన్స్ ధరించి, తన కారులో ఫ్రెండ్స్‌తో కలిసి ప్రయాణించాడు. ఢిల్లీ నుంచి రుషికేశ్‌కు వెళ్లారు. ఐదు గంటల తర్వాత అతడి కాలు పనిచేయకపోవడంతో కాస్త కదిలించాడు. అయితే.. తిరుగు ప్రయాణమై ఢిల్లీకి వచ్చాక ఊపిరి తీసుకునేందుకు ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. 
 
గుండె పోటు వచ్చిందని తేలింది. అతడు ఆస్పత్రికి వచ్చేసరికి పల్స్ రేటు నిముషానికి 10-12 మధ్య ఉందని డాక్టర్లు తెలిపారు. అతడు టైట్ జీన్స్‌లో ఏకధాటిగా 8 గంటలపాటు కదలకుండా ఉండటంతో గుండెపోటు వచ్చిందని వెల్లడించారు.