మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 9 నవంబరు 2019 (14:43 IST)

ఇమ్రాన్ ఖాన్‌కు థ్యాంక్స్ చెప్పిన నరేంద్ర మోడీ.. ఎందుకు?

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. కర్తార్‌పూర్ కారిడార్ నిర్మాణానికి సహకరించినందుకు ఆయన ఈ ధన్యవాదాలు తెలిపారు. 
 
ఈ కర్తార్‌పూర్ కారిడార్‌ను పంజాబ్ ప్రభుత్వంతో పాటు పాకిస్థాన్, ఎస్.జి.పి.సిలు కలిసి పూర్తి చేశాయి. ఈ కారిడార్ ప్రారంభోత్సవం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరిగింది. సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ దేవ్ 550వ జయంతి సందర్భంగా దీన్ని ప్రారంభించారు. 
 
ఇందుకోసం ప్రధాని మోడీ పంజాబ్‌లోని సుల్తాన్‌పూర్ లోధికి వెళ్లారు. అక్కడ డేరా బాబా నానక్‌ను సందర్శించి ఇక్కడి ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు (ఐసీపీ)ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 'గురుబనీని ప్రపంచంలోని పలు భాషల్లోకి తర్జుమా చేస్తున్నాం. ఈ పనికి చొరవతీసుకున్న యునెస్కోకి కృతజ్ఞతలు అని చెప్పారు. 
 
అలాగే, దేశంలో గురు నానక్ దేవ్‌కి సంబంధించిన అన్ని పుణ్య క్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక రైలు సేవలను ప్రారంభించనున్నట్టు తెలిపారు. అమృత్‌సర్, కేశ్‌ఘర్, ఆనంద్‌పూర్, డామ్‌డమ, పాట్నా, నాందేడ్‌లలోని సిక్కు పవిత్ర క్షేత్రాలను కలుపుతూ రైల్వేశాఖ కొత్త రైళ్లను నడపనున్నట్టు ఆయన వెల్లడించారు.