శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వి
Last Modified: మంగళవారం, 17 నవంబరు 2020 (15:47 IST)

అద్భుత దేశం భారతదేశం: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా “ఏ ప్రామిస్డ్ ల్యాండ్” పేరిట ఓ కొత్త పుస్తకం రాసారు. అందులో భారతదేశం విశిష్టతను గురించి కొనియాడారు. భారత్ హిందూ సాంప్రదాయాలు వంటి ఎన్నో విషయాలను గురించి ప్రస్తావించారు. తన బాల్యం గురించి ఆ పుస్తకంలో తెలియజేశారు.
 
ఇండోనేషియాలో తన బాల్యం గడిచిందని తెలిపారు. అప్పట్లో తాను రామాయణం, మహాభారతం గురించిన కథలను విన్నానని పేర్కొన్నారు. భారత్ అతి పెద్ద దేశమని ప్రపంచంలో ఆరోవంతు జనాభా అక్కడే ఉందని తెలిపారు. భారత దేశంలో సుమారు 2 వేల స్థానిక తెగలున్నాయని తెలిపారు.
 
భారత్‌లో దాదాపు 700 పైగా భాషలు మాట్లాడుతారని తెలిపారు. 2010 అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్నప్పుడు తొలిసారి ఒబామా భారత్‌ను పర్యటించారు. అయితే చిన్నప్పటి నుంచి ఊహల్లో మాత్రం భారత్‌కు ప్రత్యేక స్థానం కల్పించినట్లు తెలిపారు. భారత్, పాకిస్థాన్ లోని తన మిత్రులు తనకు పప్పు కీమా వండటం నేర్పించారని తెలిపారు. అలాగే తనకు బాలీవుడ్ సినిమాలు చూసే అలవాటు కూడా చేశారని తెలిపారు.