శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 ఆగస్టు 2021 (18:11 IST)

రూ.300 కోట్లతో రష్యాతో డీల్.. 70వేల ఏకే-103 అజాల్ట్ రైఫిల్స్ కోసం,..?

Russia
రష్యా నుంచి పెద్ద ఎత్తున ఆయుధాల కొనుగోలుకు భారత వాయు సేన (ఐఏఎఫ్) ఒప్పందం కుదుర్చుకుంది. ఐఏఎఫ్‌కు 1.5 లక్షలకుపైగా అజాల్ట్ రైఫిల్స్ అవసరం. రూ.300 కోట్లతో దాదాపు 70 వేల ఏకే-103 అజాల్ట్ రైఫిల్స్ కొనుగోలుకు ఐఏఎఫ్ రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ రైఫిల్స్ రానున్న మరికొద్ది నెలల్లో ఐఏఎఫ్‌కు చేరుకోవచ్చు. 
 
ఆఫ్ఘనిస్థాన్‌లో అమెరికా దళాలు వదిలేసిన ఆయుధాలు భారత దేశంలోని ఉగ్రవాద మూకలకు చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యవసర నిబంధనల క్రింద ఐఏఎఫ్ ఈ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ ప్రకారం రైఫిల్స్ రానున్న మరికొద్ది నెలల్లో ఐఏఎఫ్‌కు చేరుకోవచ్చు. 
 
ఇవి అందుబాటులోకి వస్తే, ఉగ్రవాద చర్యలను మరింత సమర్థంగా తిప్పికొట్టడానికి వీలవుతుంది. వీటిని మొదట జమ్మూ-కశ్మీరు, శ్రీనగర్, కీలక వాయు సేన స్థావరాల్లోని దళాలకు అందజేస్తారు. ఈ ఒప్పందంపై సంతకాలు గత వారం జరిగినట్లు తెలుస్తోంది.