Daily Horoscope
✕

స్టార్ లింక్ శాటిలైట్ సేవల సాయంతో అమెరికాపై ఇరాన్ దాడులు

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 29 నవంబరు 2026 (13:33 IST)
స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌లింక్‌ శాటిలైట్ ఇంటర్నెట్‌ సేవలను ఉపయోగించుకుని పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడులకు పాల్పడినట్లు సమాచారం. యుద్ధం మొదట్లో ఈ పరిణామం జరిగినట్లు వాషింగ్టన్‌ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. 
 
స్టార్‌లింక్‌ను అనధికారికంగా ఉపయోగించిన సందర్భాలను స్పేస్‌ఎక్స్ గుర్తించినట్లు తెలిపింది. అదేవిధంగా అమెరికా సైన్యం కూడా స్టార్‌షీల్డ్‌ను నిబంధనలను ఉల్లంఘించి వినియోగించినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. స్టార్‌షీల్డ్‌ట అనేది దేశ భద్రత, సైనిక అవసరాల కోసం స్పేస్‌ఎక్స్‌ రూపొందించిన సురక్షిత ఉపగ్రహ నెట్‌వర్క్.
 
ఒకవైపు ఇరాన్‌ స్టార్‌లింక్‌ వినియోగం, మరోవైపు కేవలం భూతల సైనిక కార్యకలాపాల కోసం తీసుకున్న స్టార్‌షీల్డ్ సబ్‌స్క్రిప్షన్‌ను అమెరికా సైన్యం డ్రోన్ దాడులకు ఉపయోగించినట్లు తెలియడంతో ఎలాన్ మస్క్ తన సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని ఆ వార్తా సంస్థ తెలిపింది. 
 
ఈ ఘటనల నేపథ్యంలో ఇద్దరు ఉన్నత స్థాయి స్పేస్ఎక్స్ అధికారులను తొలగించారని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. యుద్ధంపై అమెరికా రక్షణశాఖ మంత్రి పీట్ హెగ్సెత్‌కు అందిన రహస్య నివేదికలో ఇరాన్ స్టార్‌లింక్‌ వినియోగం గురించి ప్రస్తావన ఉన్నట్లు చెప్పింది. అయితే, అలాంటి నివేదిక గురించి తమకు తెలియదని పెంటగాన్ స్పష్టం చేసింది. 
About Author
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

AA23: రచయిత అప్‌డేట్‌తో అల్లు అర్జున్-లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్‌కు ఊపు

Akhil Japan : జపాన్ లో అఖిల్ అక్కినేనిపై అమితమైన ప్రేమ ప్రదర్శన

Tabitha sukumar : ఇడుపు కాయితం లో ఉల్లిపూల సాంగ్ కోసం తబిత అక్క ఎంతో తపన పడ్డారు : ప్రియదర్శి

Seetannapeta Gate : వినూత్నమైన కథగా సీతన్నపేట గేట్ : హీరో వేణు గోపాల్

Naga Chaitanya: తొలి పది నిమిషాలు మిస్ కాకండి - లార్జ్ స్కేల్ సినిమా వృషకర్మ తో వచ్చింది : నాగచైతన్య

తర్వాతి కథనం
Show comments