బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 అక్టోబరు 2016 (17:51 IST)

స్విస్ చీజ్- 10 బాటిళ్ల వైన్ లేనిదే కిమ్ జోంగ్‌కు నిద్రపట్టదు.. చుట్టూ అందమైన అమ్మాయిలతో...?

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ 2012 నుంచి అధికారంలోకి వచ్చాక మరీ భోజన ప్రియుడిగా మారిపోయారని గతంలో ఆయన వద్ద చెఫ్‌గా పనిచేసిన కెంజీ ఫుజిమోటో తెలిపారు. ప్రతిరోజూ ఆయనకు వైన్ లేకుండా ముద్ద దిగదన్నా

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ 2012 నుంచి అధికారంలోకి వచ్చాక మరీ భోజన ప్రియుడిగా మారిపోయారని గతంలో ఆయన వద్ద చెఫ్‌గా పనిచేసిన కెంజీ ఫుజిమోటో తెలిపారు. ప్రతిరోజూ ఆయనకు వైన్ లేకుండా ముద్ద దిగదన్నారు. ఒక్క రాత్రికే కప్పులు కప్పులు స్విస్ జున్నుతో పాటు పది బాటిళ్ల బార్డియాక్స్ వైన్ లాగించేస్తారని తెలిపారు. అంతే కాదు.. ఇష్టమైన వంటకాలు.. చుట్టూ అందమైన అమ్మాయిలను పెట్టుకుని భోజనం చేయడం ఉన్‌కు అలవాటని కెంజీ వ్యాఖ్యానించారు. 
 
మందు లేనిదే ఆయనకు నిద్రపట్టదని.. ఉన్ కుటుంబంతో 1982 నుంచి చెఫ్‌గా అనుబంధం ఉన్న కెంజీ వివరించారు. ఉన్‌ స్విట్జర్లాండ్‌లోని బోర్డింగ్‌ స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో అక్కడి చీజ్ తెగ నచ్చడంతో పాటు... ఉత్తర కొరియా జున్ను నచ్చక.. 2014లో కొందరు వంటవాళ్లను ఓ ఫ్రెంచ్‌ కుకరీకి పంపించి మరీ స్విస్‌ జున్ను ఎలా తయారుచేయాలో శిక్షణ ఇప్పించారని కెంజీ తెలిపారు. ఉన్‌కు ఆహారం పట్ల ప్రియంతో భారీగా బరువు పెరుగుతున్నారని.. డయాబెటిస్ ఉన్నప్పటికీ.. ఇష్టమైన వంటకాల్ని తెగ లాగించేస్తున్నారని సమాచారం.