విడాకుల తర్వాత నేను చనిపోయినట్లు భావించాను.. సమంత
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత "నేను చనిపోయినట్లు భావించాను" అని తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత తన మాజీ భర్త నాగ చైతన్య నుండి విడాకుల గురించి ఓపెన్ అయ్యింది. విడాకుల తర్వాత చనిపోవాలని భావించానని తన బలహీనత గురించి మాట్లాడింది. దాన్ని అధిగమించినందుకు తనకెంతో గర్వంగా ఉందని ఆమె పేర్కొంది. అలాంటి వ్యక్తిగత విషయాల గురించి తెరవడానికి అపారమైన ధైర్యం అవసరం అని చెప్పుకొచ్చింది.
సమంత నాగ చైతన్య 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే 2021లో విడిపోయారు. ఇక 2024లో, నాగ చైతన్య మరోసారి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఈసారి నటి శోభితా ధూళిపాళతో, డిసెంబర్ 4, 2024న వివాహం చేసుకోనున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి వివాహం జరుగనుంది.