మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 నవంబరు 2024 (14:10 IST)

ఏఆర్.రెహ్మాన్ తండ్రిలాంటివారు... ఆ సంబంధం అంటగట్టొద్దు ప్లీజ్ : మోహిని డే

mohini dey
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తనకు తండ్రితో సమానమని అందువల్ల ఆయనకు, తనకు అక్రమ సంబంధం అంటగట్టొద్దన బాసిస్ట్ మోహిని డే స్పష్టం చేశారు. తన కారణంగానే రెహ్మాన్ తన భార్య సైరా బానుకు విడాకులు ఇచ్చారన్న వార్తలపై మోహని డే స్పందించారు. "ఏఆర్ రెహ్మాన్ నాకు తండ్రితో సమానం. ఎనిమిది ఏళ్ల నుంచి ఆయన బృందంలో పనిచేస్తున్నాను" అని మోహిని పేర్కొన్నారు. తమపై ఇలాంటి వార్తలు రావడం చాలా బాధించిందని ఆమె తెలిపారు.
 
కాగా, రెహ్మాన్, సైరా బాను దంపతులు తమ 29 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ ఇటీవల విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ విడాకుల ప్రకటన వచ్చిన కాసేపటికే తన భర్త నుంచి విడిపోతున్నట్లు బాసిస్ట్ మోహిని వెల్లడించడంతో వారిద్దరిని లింక్ చేస్తూ పుకార్లు పుట్టుకొచ్చాయి.
 
సామాజిక మాధ్యమాల్లో చాలా మంది ఈ విషయమై నెగటివ్‌‍గా మాట్లాడటం చేశారు. దాంతో ఇటీవల ఈ విషయంపై స్పందించిన మోహిని డే ఆ రూమర్లను తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు మరోసారి ఈ అంశంపై ఆమె స్పందించారు. రెహ్మన్ కుమార్తెలది, తనది ఒకే వయసు అని, ఆయన ఎపుడూ తనను తన కుమార్తెలానే చూశారని మోహిని డే అన్నారు. 
 
తన కెరీర్లో ఆయన కీలకపాత్ర పోషించారని, తన జీవితానికి రెహ్మాన్ రోల్ మోడల్ అని పేర్కొన్నారు. తమపై ఇలాంటి రూమర్స్ రావడం బాధాకరం అన్నారు. అసభ్యకరంగా మాట్లాడడం నేరంగా పరిగణించాలని తెలిపారు. ఇక ఇలాంటి వార్తలు తన కెరీర్‌కు అంతరాయం కలిగించలేవన్నారు. దయచేసి ఇలాంటి వాటికి ఇక్కడితో ఫుల్‌స్టాఫ్ పెట్టి, తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని మోహిని డే కోరారు.