మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2024 (18:46 IST)

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

AR Rahman
AR Rahman
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహ్మాన్ విడాకుల వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సైరాభానుతో 29 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలకడం ఆయన ఫ్యాన్స్ మధ్య తీవ్ర ఆవేదనకు గురిచేసింది. తాజాగా సైరా-రెహ్మాన్ విడాకులకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే.. సైరాభాను లాయర్ వందన షా ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్‌గా మారింది. వీరిద్దరూ మళ్ళీ కలిసే అవకాశం లేకపోలేదన్నారు.

తాను ఆశావాదినని.. ఎప్పుడు ప్రేమ, రొమాన్స్ గురించి మాట్లాడుతాను కానీ వాళ్ళు ఎన్నో చర్చల తర్వాత బాధతో విడాకుల నిర్ణయం తీసుకున్నారు. అయినప్పటికీ వాళ్ళు కలిసే అవకాశం లేదని చెప్పలేమని హింట్ ఇచ్చారు. దీంతో రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా అనే రీతిలో ఫ్యాన్స్ చర్చలు జరుపుతున్నారు.
 
ఇక రెహ్మాన్ పిల్లలు ఎవరి దగ్గర ఉండాలో వాళ్లే ఫిక్స్ అవుతారు. వాళ్ళు ఇంకా చిన్న పిల్లలేం కాదు.. వ్యక్తిగత అభిప్రాయాలు, స్వేచ్ఛ వారికి ఉందని సైరా లాయర్ అన్నారు. ఇక భరణం గురించి మాట్లాడుతూ.. సైరా ఎలాంటి ఆర్థిక ఉద్దేశాలతో ఈ నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. 
 
మరోవైపు సైరా కూడా విడాకులపై స్పందించింది. ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల ముంబైకి చికిత్స కోసం వెళ్లానని.. రెహ్మాన్‌పై ఎలాంటి చెడు వార్తలు ప్రచారం చేయొద్దన్నారు. ఆయనంటే తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఆయనకు కూడా తానంటే ఇష్టం. ఆయనపై విమర్శలు చేయడం ఇకనైనా ఆపాలని కోరారు.

తాము ఇంకా అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. కాబట్టి ఈ క్లిష్ట సమయంలో మా ప్రైవసీకి భంగం కలిగించవద్దు. త్వరలోనే తాను చెన్నై వస్తానని.. ఆయన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించవద్దు అని సైరా మీడియాకు విజ్ఞప్తి చేశారు.