ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (11:04 IST)

నేలకు చేతులు ఆనిచ్చి బొంగరంలా తిరుగుతున్న కింగ్ జాంగ్ (Video)

ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ అంటే బొద్దుగా ఉన్న శరీరాకృతి, విచిత్రమైన హెయిల్ స్టైల్ గుర్తుకు వస్తాయి. వరుస క్షిపణి, అణు పరీక్షలతో అమెరికాకు నిద్ర లేకుండా చేస్తున్న కిమ్... కరుడుగట్టిన నియంత మాత్ర

ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ అంటే బొద్దుగా ఉన్న శరీరాకృతి, విచిత్రమైన హెయిల్ స్టైల్ గుర్తుకు వస్తాయి. వరుస క్షిపణి, అణు పరీక్షలతో అమెరికాకు నిద్ర లేకుండా చేస్తున్న కిమ్... కరుడుగట్టిన నియంత మాత్రమే కాదు... మంచి బాస్కెట్ బాల్ క్రీడాకారుడు కూడా. సంగీతమంటే చెవులు కోసుకుంటారు. సంగీతంపై ఉన్న మక్కువతోనే గాయని రిసోల్ జుని పెళ్లాడారు. భోజనం పట్ల మక్కువతో కిమ్ జాంగ్ బొద్దుగా తయారయ్యారట. అయినా కూడా ఫిట్నెస్ విషయంలో ఆయన ఏమాత్రం రాజీపడరని ఆయన సన్నిహితులు చెబుతారు.
 
ఇపుడు ఇదేవిషయాన్ని రుజువు చేసేలా ఫిట్నెస్ విన్యాసాలు చేస్తున్నాడు. తాజాగా ఆయన చేసిన విన్యాసాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వీడియోను ఎవరు, ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో తెలియనప్పటికీ... సోషల్ మీడియాలో మాత్రం ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. రెండు కాళ్లు పైకెత్తి, చేతులను నేలకు తాకిస్తూ, గిరగిరా తిరుగుతున్న కిమ్ చూసి, అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ వీడియోనూ మీరు కూడా ఓ సారి తిలకించండి. ఈ వీడియోను ఇప్పటికే 2.50 లక్షల మంది వీక్షించగా, లక్ష మంది లైక్ చేశారు.
 
కాగా, ఉత్తర కొరియా, అమెరికా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. ముఖ్యంగా, కిమ్ జాంగ్ ఉన్ జరుపుతున్న వరుస క్షిపణి పరీక్షలు అగ్రరాజ్యాన్ని బంబేలెత్తిస్తున్నాయి. దీంతో ఉత్తర కొరియాపై అనేక ప్రపంచ దేశాలు ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. దీంతో ఉ.కొరియా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. వీటి నుంచి గట్టెక్కేందుకు ఆ దేశ అక్రమంగా ఆయుధాలను విక్రయిస్తుందనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో కింగ్ జాంగ్ ఉన్‌కు విన్యాసాలకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి రావడం గమనార్హం.