శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (09:27 IST)

బాలికల నుంచి యువతుల వరకు.. లైంగికంగా వేధించిన వైద్యుడికి 125 ఏళ్ల జైలు

అమెరికాలోని క్రీడాకారిణులను దశాబ్ధాలకు తరబడి లైంగికంగా వేధించిన మాజీ వైద్యుడు లారీ నస్సేర్‌కు 125 ఏళ్ల జైలుశిక్ష పడింది. వయోభేదం అంటూ లేకుండా బాలికల నుంచి యువతుల వరకూ దాదాపు 260 మందికి పైగా క్రీడాకారి

అమెరికాలోని క్రీడాకారిణులను దశాబ్ధాలకు తరబడి లైంగికంగా వేధించిన మాజీ వైద్యుడు లారీ నస్సేర్‌కు 125 ఏళ్ల జైలుశిక్ష పడింది. వయోభేదం అంటూ లేకుండా బాలికల నుంచి యువతుల వరకూ దాదాపు 260 మందికి పైగా క్రీడాకారిణులను దశాబ్ధాల పాటు వేధించిన ఇతనికి మిషిగన్‌లోని చార్లెట్ న్యాయస్థానం సోమవారం శిక్షను ఖరారు చేసింది. 
 
ఇప్పటికే గత డిసెంబరులో 60ఏళ్ల జైలు శిక్ష పడింది. భిన్న లైంగిక వేధింపుల ఆరోపణలపై గరిష్ఠంగా 172 ఏళ్ల శిక్షను జనవరిలో కోర్టు విధించింది. తాజాగా ఈ శిక్షను 125 సంవత్సరాలకు మిషిగన్‌లోని చార్లెట్ న్యాయస్థానం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
తీర్పు వెలువడిన అనంతరం లారీ నస్సేర్ క్షమాపణలు చెప్పారు. మిషిగన్ స్టేట్ వర్శిటీ క్లినిక్‌లో లారీ వైద్యుడిగా పనిచేశారు. ఆ సమయంలోనే చికిత్స పేరిట క్రీడాకారిణులను లైంగికంగా వేధించారు.