గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 9 జనవరి 2018 (20:54 IST)

భార్యను చూసి భర్తకు గుండెపోటు... ఎందుకంటే?

అతడో కాకలు తీరిన గ్యాంగస్టర్. అంతేకాదండోయ్... వరుసగా ఐదుసార్లు గెలిచిన ప్రజాప్రతినిధి. గ్యాంగస్టర్ నుంచి రాజకీయ నాయకుడుగా ఎదిగిన ఓ నాయకుడు తన భార్యను చూడగానే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఎందుకలా జరిగింది అంటే ఈ కథనం చూడాల్సిందే. ఉత్తరప్రదేశ్ బీఎస్పీ

అతడో కాకలు తీరిన గ్యాంగస్టర్. అంతేకాదండోయ్... వరుసగా ఐదుసార్లు గెలిచిన ప్రజాప్రతినిధి. గ్యాంగస్టర్ నుంచి రాజకీయ నాయకుడుగా ఎదిగిన ఓ నాయకుడు తన భార్యను చూడగానే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఎందుకలా జరిగింది అంటే ఈ కథనం చూడాల్సిందే. ఉత్తరప్రదేశ్ బీఎస్పీ తరపున పోటీ చేసిన ముక్తార్ అన్సారీ వివిధ కేసుల్లో ఇరుక్కుని జైలు పాలయ్యాడు. ఇతడిని బాందా జైలులో వుంచారు. 
 
గత 2015 నుంచి జైల్లోనో వుంటున్నాడు. మంగళవారం నాడు ఆయన భార్య తన భర్తను చూసుకునేందుకు జైలుకు వచ్చింది. ఐతే భార్యను చూడగానే అన్సారీకి హఠాత్తుగా గుండెపోటు వచ్చేసింది. దీనితో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అతడిని అలా చూసేసరికి ఆయన భార్య కూడా సొమ్మసిల్లిపడిపోయింది. అన్సారీని జైలు అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన భార్యను కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు.