శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 18 ఆగస్టు 2017 (14:17 IST)

బాలకృష్ణ దవడ పగులగొట్టినందుకు ఆ అభిమాని ఉప్పొంగిపోయాడట...

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు పూలదండ వేయడానికి వచ్చిన ఓ అభిమానిని హీరో బాలకృష్ణ దౌడ పగులగొట్టిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. దీనిపై కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశె

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తనకు పూలదండ వేయడానికి వచ్చిన ఓ అభిమానిని హీరో బాలకృష్ణ దవడ పగులగొట్టిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. దీనిపై కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తనదైనశైలిలో స్పందించారు.
 
‘బాలకృష్ణ దవడ పగులగొడితే ఆ అభిమాని ఉప్పొంగిపోయి ఉంటాడు. బాలకృష్ణ చేయి తాకడం అంటే పుణ్యం చేసుకున్నట్లు’ అని ఆయన వ్యాఖ్యానించి సరికొత్త చర్చకు తెరతీశారు. కాగా, ఆ అభిమానిపై చేయి చేసుకునే హక్కు బాలకృష్ణకు ఎవరిచ్చారనే విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.  
 
కాగా, బుధవారం రాత్రి నంద్యాలలో తన అభిమాన హీరో బాలకృష్ణకు పూల దండ వేసి, ఆయనతో ఓ ఫొటో దిగాలని భావించిన ఓ అభిమానికి తీవ్ర నిరాశ ఎదురైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో సోమిశెట్టి స్పందించారు.