శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 11 ఆగస్టు 2017 (17:31 IST)

8 నెలల చిన్నారిని ఫ్రిజ్‌లో పెట్టారు... ఎక్కడ (Video)

ప్రపంచవ్యాప్తంగా చిన్నారులపై జరుగుతున్న దాష్టీకాలు నానాటికీ ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఎనిమిది నెలల చిన్నారిని ఫ్రిజ్‌లో పెట్టి చిత్రహింసలకు గురిచేశాడు. ఈ దారుణానికి ఒడిగట్టింది కూడా యువతులేకావడం గమనార

ప్రపంచవ్యాప్తంగా చిన్నారులపై జరుగుతున్న దాష్టీకాలు నానాటికీ ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఎనిమిది నెలల చిన్నారిని ఫ్రిజ్‌లో పెట్టి చిత్రహింసలకు గురిచేశాడు. ఈ దారుణానికి ఒడిగట్టింది కూడా యువతులేకావడం గమనార్హం. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ వివరాలను పరిశీలిస్తే.. 
 
అమెరికాలోని మసాచుసెట్స్ ప్రాంతంలో ఓ చిన్నారికి సంరక్షకులుగా ఇద్దరు మైనర్ బాలికలు ఫ్రిజ్‌లో పెట్టి మూత వేశారు. ఆ చిన్నారి చల్లదనం తట్టుకోలేక గుక్కపెట్టి ఏడుస్తున్నా వారు ఏమాత్రం జాలిచూపలేదు. 
 
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఆధారంగా చేసుకుని రంగంలోకి దిగిన అమెరికా పోలీసులు ఆ చిన్నారిని రక్షించడమే కాకుండా, ఆ ఇద్దరు మైనర్ బాలికలను అరెస్టు చేశారు. 
 
వీరిని కోర్టులో హాజరుపరచగా, చిన్నారిని ఫ్రిజ్‌లో పెట్టి హింసించినందుకు ఇద్ద‌రు మైన‌ర్ బాలిక‌ల‌కు ఆ ప్రాంత కోర్టు శిక్ష విధించింది. అమెరికా చ‌ట్టం ప్ర‌కారం ప‌సిపిల్ల‌ల‌ను హింసించిన నేరం కింద శిక్ష విధించారు. నిందితురాళ్లిద్ద‌రూ మైన‌ర్లు కావ‌డంతో వారికి సంబంధించిన వివ‌రాల‌ను పోలీసులు బ‌య‌ట‌పెట్ట‌లేదు. ప్ర‌స్తుతం చిన్నారి క్షేమంగా ఉన్న‌ట్లు వారు తెలియ‌జేశారు.