Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

సైన్స్ మాస్టార్‌ను పెళ్లి చేసుకున్న అమెజాన్ చీఫ్ మాజీ భార్య

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 9 మార్చి 2021 (09:28 IST)
ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలుగా గుర్తింపు పొందిన అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ మాజీ భార్య మెకెంజీ స్కాట్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వాషింగ్టన్‌లోని సీటెల్‌కు చెందిన సైన్స్‌ టీచర్‌ డాన్‌ జీవెట్‌ను ఆమె వివాహమాడారు. ఈ విషయాన్ని జీవెట్‌ ఓ వెబ్‌సైట్‌‌లో పంచుకున్నారు. 
 
50 ఏళ్ల స్కాట్‌ 53 బిలియన్‌ డాలర్ల సంపదతో ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ ప్రకటించిన ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన వ్యక్తుల జాబితాలో 22వ స్థానంలో ఉన్నారు. జెఫ్‌ను పెళ్లి చేసుకున్న ఆమె 25 ఏళ్ల తర్వాత 2019లో విడాకులు తీసుకున్నారు. విడిపోయాక స్కాట్‌కు అమెజాన్‌ నుంచి 38 బిలియన్‌ డాలర్ల షేర్లు లభించాయి. 
 
ఆమెకు అమెజాన్‌లో ఇప్పుడు 4 శాతం వాటా కూడా ఉంది. కొవిడ్‌ సహాయక చర్యల్లో భాగంగా స్కాట్‌ గత ఏడాది పలు ఆహార పంపిణీ కేంద్రాలు, అత్యవసర సహాయ నిధి కింద 4.1 బిలియన్‌ డాలర్ల విరాళాన్ని అందించారు. 
 
గొప్ప మానవతావాది అయిన స్కాట్ బిలియన్ల కొద్దీ డాలర్లను విరాళంగా అందిస్తూ వస్తున్నారు. జాతి సమానత్వం, స్వలింగ సంపర్కుల హక్కులు, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం గత ఏడాది స్కాట్‌ 1.7 బిలియన్‌ డాలర్ల విరాళాన్ని ఇచ్చారు. 

అన్నీ చూడండి

Suriya: సైకో పోలీస్ ఆఫీసర్‌గా సీన్ గ్లింప్స్ తో ఆకట్టుకున్న సూర్య

Dulquer Salmaan : ఆకాశంలో ఒకతార గా ఎదగాలనే కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్

Ranabali date: అక్టోబర్ 16న థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న రణబాలి మూవీ

Namit Malhotra: రామాయణ నుండి భారీ అప్‌డేట్ ప్రకటించిన నమిత్ మల్హోత్రా

Raka 37: అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో రాకా 37 పోస్టర్ తో క్రేజ్

తర్వాతి కథనం
Show comments