గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 8 మార్చి 2021 (18:11 IST)

పెళ్లి పేరుతో భార్య కజిన్‌పై లైంగికదాడి... గర్భస్రావం చేసి...

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పట్టణంలో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన భార్యకు సోదరి వరుస అయ్యే బాలికపై ఓ కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గర్భందాల్చింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు గర్భస్రావం చేయించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గుజరాత్‌లోని లింబాయత్‌ ప్రాంతంలో బాధితురాలిని నిందితుడు ఆరు నెలలుగా లైంగిక వేధింపులకు గురిచేయడంతో ఆమె గర్భం దాల్చింది. కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో బాలికకు గర్భస్రావం చేయించారు. నిందితుడిని షఫీక్‌ షేక్‌(25)గా గుర్తించారు. 
 
బాలికపై వేధింపుల గురించి సమాచారం బయటకు పొక్కడంతో నిందితుడు బాధితురాలి కుటుంబ సభ్యులను బెదిరించాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో షేక్‌ దురాగతం వెల్లడైంది. 
 
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుటుంబ కార్యక్రమాల్లో వీరిద్దరికీ పరిచయం కాగా నిందితుడు బాలికను పెండ్లి చేసుకుంటానని బహుమతుల ఆశచూపి లోబరుచుకున్నాడు. నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.