గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 8 మార్చి 2021 (14:06 IST)

ఇంటి ఎదురుగా బిజినెస్‌మేన్, రమ్మనగానే వచ్చేసాడు, ఆ తర్వాత నగ్న ఫోటోలతో...

ఈ మహిళ మామూలు మహిళ కాదు. కోటీశ్వరుడైన వ్యాపారవేత్తను బొల్తా కొట్టించి, నగ్న ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేసి రూ. 30 లక్షలు డిమాండ్ చేసింది. ఆ తర్వాత పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది.
 
పూర్తి వివరాల్లోకి వెళితే... కర్నాటకలోని కొప్పళ్లో స్టీల్ కంపెనీ పెట్టిన ఓ వ్యాపారవేత్త హోస్పేట లోని ఎంజే నగర్ 6వ క్రాస్ వీధిలో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసాడు. ఆ కార్యాలయానికి ఎదురుగా గీత అనే మహిళ అతడికి పరిచయమైంది.
 
ఈ పరిచయంతోనే ఓ రోజు అతడిని టీ తాగి వెళ్లండి అంటూ ఆహ్వానించింది. ఆమె పిలిచేసరికి అతడు గీత ఇంటికి వెళ్లాడు. ఆమె టీ ఇవ్వగానే తాగాడు. కొద్దిసేపటికో మత్తులోకి జారుకున్నాడు. ఈ లోపు గీత చేయాల్సినదంతా చేసేసేంది. గంటసేపటి తర్వాత తేరుకుని ఇంటికి వెళ్లిపోయాడు.
 
రెండుమూడు రోజుల తర్వాత గీత సదరు వ్యాపారవేత్తకు ఫోన్ చేసి.. నీ నగ్న వీడియోలు నావద్ద వున్నాయి. రూ. 30 లక్షల ఇచ్చి ఆ సీడిని తీసుకెళ్లంటూ వార్నింగ్ ఇచ్చింది. దీనితో షాక్ తిన్న వ్యాపారవేత్త ఆమె అడిగినట్లే తొలుత రూ. 15 లక్షలు ఆమె ఖాతాలో వేశాడు. మిగిలిన డబ్బు కోసం గీత ఒత్తిడి చేస్తుండటంతో చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పోలీసులు గీత ఇంట్లో సోదా చేయగా దాదాపు 3 గ్రాముల గంజాయి ఆమె వద్ద లభించింది. దీనితో ఆ మహిళతో పాటు ఆమెకి సహకరించిన ఆమె కుమారుడ్ని అరెస్టు చేసారు.