గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 26 మార్చి 2018 (16:20 IST)

తప్పుడు వార్తలు రాశారో.. పదేళ్ల జైలు శిక్ష తప్పదండోయ్..

మీడియా సంస్థలు, ఆన్‌లైన్ వెబ్ సైట్లు రేటింగ్ కోసం వార్తలను ముందుగా ప్రచురించేందుకు ఎగబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తప్పుడు వార్తలు రాసే మీడియాపై చర్యలు తీసుకునే దిశగా మలేషియా సర్కారు కసరత్తు చ

మీడియా సంస్థలు, ఆన్‌లైన్ వెబ్ సైట్లు రేటింగ్ కోసం వార్తలను ముందుగా ప్రచురించేందుకు ఎగబడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తప్పుడు వార్తలు రాసే మీడియాపై చర్యలు తీసుకునే దిశగా మలేషియా సర్కారు కసరత్తు చేస్తోంది. అంతేకాకుండా తప్పుడు వార్తలు రాసిన వారికి.. అలాంటి వార్తలు ప్రచారం చేసిన వారికి పదేళ్ల జైలు శిక్ష విధించేలా కొత్త చట్టాన్ని తేనుంది. 
 
దీంతో తప్పుడు వార్తలు రాసేవారికి పదేళ్ల జైలు లేదా 128000 డాలర్ల జరిమానా విధించే దిశగా చట్టాన్ని తేనున్నట్లు మలేషియా సర్కారు భావిస్తోంది. కొన్ని సందర్భాల్లో జైలు శిక్షతో పాటు, జరిమానాను కూడా విధించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ చట్టంపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా.. మలేషియా సర్కారు మాత్రం వాటిని కొట్టిపారేస్తోంది. ప్రజా భద్రత కోసమే ఈ చట్టాన్ని తీసుకువస్తున్నామని.. ఇది భావ ప్రకటనా స్వేచ్ఛకు ఏమాత్రం భంగం కలిగించదని భరోసా కల్పించడం కోసమేనని వివరణ ఇచ్చింది.