శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 11 మార్చి 2018 (10:27 IST)

ఆ ఫైలును పెంటకుప్పలో పడేసేవాడిని : రాహుల్ గాంధీ

గత 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దుపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ప్రధానమంత్రిగా తానేగనుక ఉండివున్నట్టయితే, నోట్ల రద్దు ప్రతిపాదనకు సంబంధ

గత 2016లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దుపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ప్రధానమంత్రిగా తానేగనుక ఉండివున్నట్టయితే, నోట్ల రద్దు ప్రతిపాదనకు సంబంధించిన ఫైలు తన వద్దకు వచ్చివుంటే ఖచ్చితంగా పెంటకుప్పలో పడేసివుండేవాడినని చెప్పుకొచ్చారు.
 
ఆగ్నేయాసియా దేశాల పర్యనలో భాగంగా ప్రస్తుతం మలేషియాలో ఉన్న రాహుల్ కౌలాలంపూర్‌లో భారత సంతతి ప్రముఖులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్లను రద్దు చేయాలన్న నిర్ణయం సరైనది కాదన్నారు. మీరు ప్రధాని అయితే పెద్ద నోట్ల మరోలా ఎలా అమలు చేస్తారన్న ప్రశ్నకు రాహుల్ బదులిస్తూ.. అసలు ఆ నిర్ణయమే తప్పన్నారు. 
 
తాను ప్రధాని మంత్రిని అయి ఉంటే, ఆ ప్రతిపాదన ఫైలు తన వద్దకు వచ్చినప్పుడు దానిని చెత్తబుట్టలో పడేసి ఉండేవాడినని అన్నారు. తలుపు ఆవల పెంటకుప్పలోకి విసిరేసి ఉండేవాడినని గట్టిగా చెప్పాడు. పెద్ద నోట్ల రద్దు ఏ రకంగా చూసినా మంచిది కాదన్నదే తన ఉద్దేశమని రాహుల్ తేల్చి చెప్పారు.