శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2016 (14:37 IST)

స్విమ్మింగ్‌ చేశాక మేకప్ పోయిందనీ భార్యకు విడాకులిచ్చిన భర్త

ప్రస్తుతం కాలంలో విడాకులు తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. భార్యాభర్తల్లో ఒకరిపై మరొకరికి అయిష్టత ఏర్పడితే వారు నిర్మొహమాటంగా విడాకులు తీసుకుంటున్నారు. కానీ ఇతర దేశాల్లో మాత్రం చిన్న విషయానికి కూడ

ప్రస్తుతం కాలంలో విడాకులు తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. భార్యాభర్తల్లో ఒకరిపై మరొకరికి అయిష్టత ఏర్పడితే వారు నిర్మొహమాటంగా విడాకులు తీసుకుంటున్నారు. కానీ ఇతర దేశాల్లో మాత్రం చిన్న విషయానికి కూడా విడాకులు తీసుకోవడం పరిపాటిగా మారిపోయింది. అయితే తాజాగా దుబాయ్‌లో ఒక విచిత్ర సంఘటన జరిగింది. 
 
కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ యువకుడు తన భార్యతో కలిసి హనీమూన్ కోసం షార్జా వెళ్ళాడు. అంతే అక్కడ అల్ మంజార్ బీచ్‌లో ఇద్దరూ కలిసి స్విమ్మింగ్ చేశారు. అయితే ఆమె నీటిలో నుంచి బయటకి వచ్చిన తర్వాత భర్త ముందుకు వచ్చి నిలబడింది. ఆమెను చూసిన భర్త ఖంగుతిన్నాడు. కారణం.. ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోవడమే. అంతే భర్తకు నోటమాట రాలేదు. కారణం స్విమ్మింగ్‌కు వెళ్లి వచ్చేసరికి ఆమె వేసుకున్న మేకప్ మొత్తం పోయింది. అంతే ఆగ్రహంతో ఊగిపోయిన భర్త ఆమెకు విడాకులిచ్చాడు. 
 
వివాహం సమయంలో తనని మేకప్ వేసి తీర్చిదిద్దారని, అందువల్లే ఆమె అందంగా కనిపించిందని పెళ్లి సమయంలో అయితే మరీ అందంగా తయారు చేసి తన ముందు నిలబెట్టారని వరుడు ఆరోపిస్తున్నాడు. ఆఖరికి తన కనురెప్పలు కూడా నకిలీవే అని వధువు తరుపువారు తనని మోసం చేశారని వరుడు ఆరోపిస్తూ విడాకులకు దరఖాస్తు చేసాడు. 
 
అయితే బాధితురాలు ఇదేవిషయాన్ని ఎన్నోసార్లు నిజం చెప్పాలని ప్రయత్నించానని కానీ అప్పటికే ఆలస్యమైందనీ ఆమె వాపోయింది. అయితే కోర్టు అతడికి వెంటనే విడాకులు మంజూరు చేయటం గమనార్హం. కానీ బాధితురాలు మానసిక వైద్యురాలిని సంప్రదించి విషయం సర్దుబాటు చేయాలని భావించిన అతడు విడాకులు తీసుకోవడానికే మొగ్గు చూపడంతో అతడికి విడాకులు మంజూరయ్యాయి.