సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 16 నవంబరు 2017 (15:27 IST)

15 ఏళ్ల బాలుడితో 36ఏళ్ల మహిళ లైంగిక సంబంధం.. మగశిశువు జననం

36ఏళ్ల మహిళ సభ్యసమాజం తలదించుకునే చర్యకు పాల్పడింది. అప్పుడప్పుడు ఇంటికొచ్చే తన కుమారుడి స్నేహితుడైన 15ఏళ్ల బాలుడితో లైంగిక సంబంధం ఏర్పరుచుకుంది. ఈ క్రమంలో సదరు మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆస్

36ఏళ్ల మహిళ సభ్యసమాజం తలదించుకునే చర్యకు పాల్పడింది. అప్పుడప్పుడు ఇంటికొచ్చే తన కుమారుడి స్నేహితుడైన 15ఏళ్ల బాలుడితో లైంగిక సంబంధం ఏర్పరుచుకుంది. ఈ క్రమంలో సదరు మహిళ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళ గత 2015వ సంవత్సరం తన కుమారుడి స్నేహితుడైన 15ఏళ్ల బాలుడితో పరిచయం ఏర్పరుచుకుంది.
 
అప్పుడప్పుడు ఇంటికొచ్చే ఆ బాలుడికి ఆల్కహాల్ ఇచ్చి.. మత్తులోకి జారుకున్నాక అతనితో లైంగికంగా కలిసేది. ఆ ఫోటోలను కూడా ఆ బాలుడికి పంపింది. ఈ క్రమంలో గర్భం ధరించిన ఆ మహిళ ఓ మగశిశువుకు జన్మనిచ్చింది. 
 
ఇక డీఎన్ఏ పరీక్షల్లో 15ఏళ్ల బాలుడే ఆ బిడ్డకు తండ్రి అని తేలింది. యువ ప్రాయంలోనే బాలుడిని లొంగదీసుకుని లైంగికంగా వేధింపులకు గురిచేసిన నేరానికి గాను.. 36ఏళ్ల మహిళపై కేసు నమోదైంది. ఆమెకు నాలుగేళ్ల పాటు జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇక శిశువు బాధిత బాలుడి కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో వుంది.