బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 14 నవంబరు 2017 (16:21 IST)

కారులో బిడ్డకు పాలిస్తున్న యువతి, ట్రాఫిక్ వాహనానికి కట్టి లాక్కెళ్లిన పోలీస్

ఈ షాకింగ్ ఘటన ముంబైలో జరిగింది. ఓ జంట చంటిపాపతో కలిసి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో భర్త దేనికోసమో షాపుకు వెళ్లేందుకు కారును రోడ్డు ప్రక్కనే పార్క్ చేశాడు. అతడు షాపుకు వెళ్లగా, అందులో వున్న యువతి తన చంటిబిడ్డకు పాలిస్తోంది. ఇంతలో ట్రాఫిక్ పోలీసు వాహనం

ఈ షాకింగ్ ఘటన ముంబైలో జరిగింది. ఓ జంట చంటిపాపతో కలిసి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో భర్త దేనికోసమో షాపుకు వెళ్లేందుకు కారును రోడ్డు ప్రక్కనే పార్క్ చేశాడు. అతడు షాపుకు వెళ్లగా, అందులో వున్న యువతి తన చంటిబిడ్డకు పాలిస్తోంది. ఇంతలో ట్రాఫిక్ పోలీసు వాహనం అక్కడికి వచ్చింది. 
 
రోడ్డు పక్కనే పార్క్ చేసి వున్న వాహనానికి లింక్ చేసి కారును ఈడ్చుకెళ్లడం మొదలుపెట్టింది. దీనితో కారులో పాలిస్తున్న తల్లి షాక్‌కు గురయ్యింది. బిడ్డకు పాలిస్తున్నాను ఆపమని కేకలు వేసినా సదరు పోలీస్ వాహనం ఆగలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది. 
 
కాగా విషయం వైరల్ కావడంతో సదరు పోలీసును వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఐతే ట్రాఫిక్ కు ఇబ్బందిగా వున్న వాహనాన్ని అడ్డు తొలగించడం తప్పేంటని పోలీసు వర్గాలు ప్రశ్నిస్తుంటే, కారులో బిడ్డకు పాలిస్తున్న యువతిని దించిన తర్వాత కారును లాక్కెళ్లి వుండాల్సిందని మహిళకు మద్దతుగా మరికొందరు వాదిస్తున్నారు.