మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 13 నవంబరు 2017 (16:08 IST)

షాకింగ్... శశికళ ఆస్తుల తనిఖీ కోసం ఐటీ 160 కార్లు, వాటి అద్దె ఎంతో తెలుసా?

జయలలిత నెచ్చెలి, జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ఆస్తులు తవ్వేకొద్దీ కోట్లలో తేలుతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు చెందిన బినామీలు ఇప్పుడు ఇళ్లకు తాళాలు వేసి పారిపోతున్నారట. ఐతే ఏ చిన్న క్లూ దొరికినా ఐటీ అధికారులు వారి ఇళ్లు, కార్యాలయాలపై అకస్మాత్తుగా తనిఖ

జయలలిత నెచ్చెలి, జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ ఆస్తులు తవ్వేకొద్దీ కోట్లలో తేలుతున్నట్లు తెలుస్తోంది. ఆమెకు చెందిన బినామీలు ఇప్పుడు ఇళ్లకు తాళాలు వేసి పారిపోతున్నారట. ఐతే ఏ చిన్న క్లూ దొరికినా ఐటీ అధికారులు వారి ఇళ్లు, కార్యాలయాలపై అకస్మాత్తుగా తనిఖీలు చేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా వారు 160 కార్లు అద్దెకు తీసుకుని చెన్నై నగరంలో ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లేందుకు రెడీ చేసుకుని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ కార్లపై ఇంకమ్ టాక్స్ డిపార్టుమెంట్ అనే స్టిక్కర్లు అంటించి వుంటున్నాయి. 
 
తనిఖీల కోసం చెన్నైలోని ఫాస్ట్‌ట్రాక్ కార్లను అద్దెకు తీసుకోవడమే కాకుండా వీటి కోసం రోజుకు 15 గంటల ప్యాకేజీ మాట్లాడుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆ కార్లకు చెల్లించిన అద్దె రూ. 6.88 లక్షలుగా వున్నట్లు చెపుతున్నారు. దేశంలోనే ఇంత భారీగా ఆదాయపు పన్ను అధికారులు సోదాలు చేయడం ఇదే ప్రధమం. ఇకపోతే చెన్నైలో వివిధ ప్రాంతాల్లో బయటపడుతున్న కోట్లకొద్దీ సంపదను చూసి అధికారులు షాక్ తింటున్నారట. 
 
తనిఖీలు ముగిశాక మొత్తం వివరాలను తెలుసుకునేందుకు పరప్పన జైలులో వున్న శశికళను విచారించే అవకాశం వున్నదని అంటున్నారు. మరోవైపు దినకరన్ మాత్రం తమిళనాడు ముఖ్యమంత్రి పళనస్వామిని తిట్టిపోస్తున్నారు. ఈ తనిఖీలకు కారణం ఆయనే అంటూ మండిపడుతున్నారు. కారణం ఎవరైతేనేమి గాని, ఇలా కోటానుకోట్ల సంపద ఎలా వచ్చిందోనని సగటు తమిళజీవి ముక్కున వేలేసుకుంటున్నాడు.